నారా లోకేష్ ను కలిసిన డాక్టర్ నెలవల విజయశ్రీ
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి రేణిగుంట (మార్చి 20)
తిరుమల పర్యటనకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను బుధవారం రేణిగుంట విమానాశ్రయంలో సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయశ్రీ లోకేష్ కు పుష్పగుచ్చం అందజేసి, శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆమె వెంట పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు