April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

మితిమీరిన వేగంతో కాలువలో దూకిన ఆటో – వ్యక్తి మృతి

1 min read

భీమ్ న్యూస్ ఇందుకూరుపేట ప్రతినిధి (మార్చి 21) ప్రమాదాలకు నెలవైన మూల తిరుగుళ్ళు వున్న స్థలం అని యావన్మదికి తెలుసు. అయినా కొందరు డ్రైవర్లు మద్యం సేవించి మితిమీరిన వేగంతో బండ్లు నడపటం వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట పంచాయతీ యాగర్లు సెంటర్ వద్ద ఒక ఆటో వేగంగా వచ్చి అదుపు తప్పి కాలువలోకి దూకింది. అప్రమత్తమైన ఇతర వాహనదారులు డ్రైవర్ ను ప్రమాదం నుండి రక్షించారు కానీ ఆటోలో వున్న మరో వ్యక్తి నీళ్లలో మునిగిపోయాడు. కాలువలో నుండి బయటకు తీసిన సమయానికి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ వ్యక్తి కొద్ది సేపటికే మృతి చెందినట్లు స్థానికుల సమాచారం. ఇక్కడ ఇప్పటికే అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కొందరు గాయాలతో బయట పడితే, కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు వున్నాయి. ఈ మధ్యనే రాజకీయ నాయకులు అట్టహాసంగా బ్రిడ్జి నిర్మాణం కోసం శిలా ఫలకాలు ప్రారంభం చేశారు. పనులు ప్రారంభం కాకముందే ఎన్నికల కోడ్ కూడా వచ్చేసింది. ఈ క్రమంలో ఇంకెన్నాళ్ళకు బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఈ సెంటర్ కొంత భాగం ఇందుకూరుపేట మండలం, మరి కొంత భాగం నెల్లూరు రూరల్ మండలం పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో ఏ స్టేషన్ పోలీసులు కూడా ఈ స్థలంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టక పోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *