ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి న్యూఢిల్లీ (మార్చి 21) ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఆయన సెల్ ఫోన్ సీజ్ చేశారు. అయితే ఈడీ ఆఫీసుకు వెళ్లడానికి కేజ్రీవాల్ ముందు నిరాకరించడంతో అధికారులు ఆయన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్, సోదాల నేపధ్యంలో సీఎం కేజ్రీవాల్ ఇంటి దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
కేజ్రీవాల్ అరెస్ట్:
మరోవైపు ఆప్ నేతలు కేజ్రీవాల్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఆప్ సర్కారును ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టై జైల్లో ఉన్నారు. ఇక ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఈడీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. ఈ కేసు పురోగతిలో భాగంగానే గురువారం సాయంత్రం ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి వెళ్లడం జరిగింది. అయితే కోర్టు కేజ్రీవాల్ తనపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని వేసిన పిటిషన్ ను తోసిపుచ్చడంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. దీనిని ఎన్నికలవేళ బిజెపి కుట్ర పూరిత చర్యగా ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.