April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

ప్రత్యేక వైద్యులచే ఆరోగ్య సురక్ష క్యాంపు

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (మార్చి 22) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జిల్లా ప్రోగ్రామ్ అధికారి 104 నోడల్ అధికారి డాక్టర్ దయాకర్ క్యాంపును పరిశీలించి, ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఎక్కువమంది ప్రజలు వచ్చేటట్లు చూడాలని, వారికి మంచిగా ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ దయాకర్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కనకరత్నం ఇందుకూరుపేట కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం నందు స్కానింగ్ కేంద్రాలను పరిశీలించి సంబంధిత వివరాలు కొరకు డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ సునీల్ తో చర్చించారు. జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య అధికారులు డాక్టర్ బ్రహ్మేశ్వర్ నాయుడు, డాక్టర్ సి. కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ నిఖిలేష్ డాక్టర్ జ్ఞాన ప్రసూన ప్రత్యేక వైద్యలచే ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించారు. ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎం.పి.డి.ఓ. పి. సాయి లహారి పర్యవేక్షించారు. ఈ వైద్య శిబిరం ద్వారా 524 మందికి ప్రత్యేక వైద్యులచే కంటి సంబంధిత వైద్యులచే ఆరోగ్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈదూరి పద్మమ్మ, హెచ్.ఇ.ఓ. శ్రీనివాసరావు, హెల్త్ ఎడ్యుకేటర్ సుధాకర్ రావు, హెల్త్ సూపర్వైజర్ రమా, సతీష్ బాబు, ఫార్మసిస్ట్ చంద్రశేఖర్, పంచాయతీ సెక్రెటరీ పి. మల్లికార్జున, ఐసిడిఎస్ సూపర్వైజర్ లలిత, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *