పసుపులేటి పార్టీలో చేరిన వైసీపీ నేత కోట వెంకట్
1 min readభీమ్ న్యూస్ కావలి ప్రతినిధి (మార్చి 22) నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 28 వార్డ్ వైసీపీ ఇన్చార్జ్, పట్టణ సేవాదళ్ ఉప ప్రధాన కార్యదర్శి, కావలి ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు కోట వెంకట్ శుక్రవారం పి.ఎస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థి, పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ ను కలిశారు. ఈ సందర్భంగా పసుపులేటి కోట వెంకట్ ను సాధారణంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. పార్టీలో చేరిన కోట వెంకట్ మాట్లాడుతూ పసుపులేటి సుధాకర్ పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి కావలి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సొంత నిధుల ద్వారా చేపట్టడం జరిగిందని అన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పసుపులేటి సేవలను గుర్తించి ప్రజలు ఆకర్షితులు అవుతున్నారన్నారు. అలాగే తాను కూడా ఇలాంటి సేవకుడికి వెంట ఉండి ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచి విజయం చేకూర్చేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.