April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ మోడీతోనే సాధ్యం: సిరిపురం

1 min read

భీమ్ న్యూస్ పాతపట్నం ప్రతినిధి (మార్చి 23) భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భారత దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు ఆకర్షితుడునై తాను ఆ పార్టీలో చేరానని పాతపట్నం నియోజకవర్గం సీనియర్ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో ప్రతి ఊరులోనూ కాషాయ జెండా ఎగరవేసేలా తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, తక్షణమే ఆ కార్యాచరణ మొదలు పెడతానని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో ఇటీవల పార్టీలో చేరిన సిరిపురం తేజేశ్వరరావు పాతపట్నంలోని ఆయన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని బీజేపీ ఇంచార్జి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల శ్రేణులు అందరి మార్గదర్శకత్వంలో, వారి సమన్వయము, సహకారంతో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని తెలిపారు. గత మూడేళ్లుగా “వలస, వారసత్వ పాలన వద్దు ” అనే సిద్ధాంతంతో, “నియోజకవర్గ సమగ్రాభివృద్దే నా జెండా అజెండా” అనే నినాదంతో నియోజకవర్గంలోని ప్రతి పల్లె తిరిగానని తన సిద్ధాంతానికి, నినాదానికి న్యాయం జరగాలంటే అందుకు సరైన వేదిక బీజేపీయేనని భావించే పార్టీలో చేరానని అన్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అభివృద్ధి కామక ప్రభుత్వాలు వస్తేనే పాతపట్నం అభివృద్ధికి బాటలు వేసుకోగలమని వివరించారు. అందుకే నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం, రాష్ట్రంలో అభివృద్ధి కాంక్షించే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు తాను ఉడతా భక్తిగా కృషి చేస్తానని వివరించారు. పదవులు తన లక్ష్యం ఎంత మాత్రం కాదని, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత పాతపట్నమే తన సంకల్పమని సిరిపురం వివరించారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ మోదీ ప్రభుత్వ విజయాలను, బీజేపీ సిద్ధాంతం లను చేరవేయటం కోసం పని చేస్తానని అన్నారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుని నియోజకవర్గం అభివృద్ధి కు కృషి చేస్తానని అన్నారు. పాతపట్నంలోని బీజేపి క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు శ్రీకాకుళం జిల్లా లబ్ధిదారుల విభాగం జిల్లా కన్వీనర్ ఉమామహేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వలురౌతు ప్రసాదరావు, దుక్క శ్రీకాంత్ రెడ్డి, బీజేపి జిల్లా ఉపాధ్యక్షులు, పాతపట్నం మండల బీజేపి అధ్యక్షుడు పెదగోపు వెంకట ప్రసాదరావు, ఎల్ ఎన్ పేట పార్టీ కార్యదర్శి జి సోమేశ్వరరావు, కొత్తూరు మండల పార్టీ కార్యదర్శి వేలంపుడి వేణుగోపాలరావు, ఎల్ ఎన్ పేట బీజేపి ఉపాధ్యక్షులు పాశాల దుర్గాప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *