April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

జక్కేపల్లి గూడూరు మాజీ సర్పంచ్ టీడీపీ లో చేరిక

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి బోగోలు (మార్చి 24) నెల్లూరు జిల్లా బోగోలు మండలం జక్కేపల్లి గూడూరు మాజీ సర్పంచ్ ఏగూరు మాలకొండయ్య, ఏగూరు మల్లికార్జున, ఏగూరు చిన మాలకొండయ్య, ఏగూరు మనోహర్, ఏగూరు మహేష్, తదితర నాయకులు యర్రం వెంకట్వశ్వర్లు రెడ్డి, సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమేశ్వర పురానికి చెందిన రజక నాయకులు చీమలదిన్నె రామయ్య, తదితరులు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కావలి టీడీపీ – జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి  వీరికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీ గా వేమిరెడ్డి ని గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *