యువతకు కలగా మిగిలిన సత్తెనపల్లి క్రీడా మైదానం
1 min read
భీమ్ న్యూస్ ప్రతినిధి సత్తెనపల్లి (మార్చి 24) పల్నాడు ముఖద్వారం గా ఉన్న సత్తెనపల్లిలో క్రీడా మైదానం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోవటంతో క్రిడాకారులకు కలగానే మిగిలి పోయిందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం క్రిడా మైదానాన్ని పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పది ఎకరాల్లో రూ.6.30 కోట్లతో ఇండోర్.., ఔట్ డోర్ తో పాటు స్విమ్మింగ్ పూల్, తదితర పనులు గత ప్రభుత్వం హయాములో చెప్పట్టారని తెలిపారు. పార్లమెంట్ పరిధిలో నరసరావుపేట తరువాత మాచర్ల, గురజాల, పెదకూరపాడు, చిలకలూరిపేట కంటే ఇక్కడే మేజర్ స్టేడియం నిర్మిస్తున్నారని చెప్పారు. ఇంకా సుమారు ఐదారు కోట్లు నిధులు మంజూరు చేస్తే పూర్తి స్థాయిలో క్రిడాకారులకు అందుబాటులో వచ్చేదని తెలిపారు.ఈ లోపు ఎన్నికలు రావటం ప్రభుత్వం మారి వైకాపా ప్రభుత్వం వచ్చిందన్నారు. ఐదేళ్లు అవుతున్నా నేటికి ఆ మేరకు నిధులు మంజూరు చేయకపోవడం తో భవనాలు శిథిలావస్థకు చేరడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్విమ్మింగ్ పూల్ లో నీరు రంగు మారి దుర్వాసన, దోమలకు ఆవాసంగా మారిందన్నారు. స్నానం తర్వాత దుస్తులు మార్చుకునేందుకు నిర్మించిన భవనాల్లో సమీపస్తులు బహిర్భూమికి వెళ్లడంతో ఆ ప్రాంతందుర్వాసన వేదజల్లుతోందని చెప్పారు. ఇదిఇలాఉంటే పిడుగురాళ్ల రోడ్డు లో షాదీఖాన కూడా నేటీకీ పూర్తి కాకపోవడంతో ముస్లిం సోదరులు వివిధ శుభకార్యాలు చేసుకునేందుకు స్థలం లేక, కళ్యాణ మండపాల్లో డబ్బులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఐదేళ్లలో సత్తెనపల్లి అభివృద్ధి కి తట్ట మట్టి కూడా వేయని మంత్రి మూడోసారి నిలబడుతున్నా ఓటు వేయమనే అడిగే అర్హత ఆయనకు లేదన్నారు. సత్తెనపల్లి అభివృద్ధి కి తన వంతుగా పాటుపడతానని జైభీమ్ రావ్ పార్టీ తరుపున జొన్నలగడ్డ విజయ్ కుమార్ అనే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని కోటు గుర్తు కే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు మహంకాళి వెంకట్రావు, దాసరి వెంకటేశ్వర్లు, చందు దుగ్గి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.