April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బహుజనుల ఆత్మీయ సమ్మేళనం

1 min read

 

  

భీమ్ న్యూస్ ప్రతినిధి చంద్రగిరి (మార్చి 24)  తిరుపతి జిల్లా చంద్రగిరిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బహుజనుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రోజునజరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతమాకుల పుణ్యమూర్తి, బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, అంబేద్కర్ ఆశయ పోరాట సమితి అధ్యక్షుడు బాదురు ఎల్లయ్య తదితరులు హాజరయ్యారు. జరగబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తీర్మానంగా .‌. పుణ్యమూర్తి తెలిపారు. రాజ్యాంగ అనుకూల శక్తులు, వ్యతిరేక శక్తుల మధ్యే 2024 ఎన్నికల పోరాటం జరుగుతుందని అన్నారుఅందుకు అనుగుణంగా బహుజన వర్గాలను చైతన్యం చేస్తున్నామని చెప్పారు. బిజెపికి చెందిన ఓ ఎంపీ 400 పార్లమెంటు సీట్లు గెలిస్తే రాజ్యాంగంలో నుంచి లౌకిక వాదం, సెక్యులర్ పదాలను తిసేస్తామన్నారని, రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఏ ఒక్క పార్టీ సొత్తు కాదని అన్నారు. ఇది అత్యంత బాధాకరం, విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న ఆచారాలతో బ్రతుకుతున్న దేశం భారతదేశంలో  సంఘ విద్రోహ, విచ్ఛిన్నకర శక్తులుగా మార్చాలనుకోవడం చర్య అభివర్ణించారు.

ఇలాంటి అంతరాలను ప్రేరేపిస్తున్న బిజెపికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రధాన పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి.కావునవారికి ఓటు వేస్తే పరోక్షంగా బిజెపికి ఓటు వేసినట్లేనని, సెక్యులర్ భావజాలంతో పనిచేస్తున్న పార్టీ నేతలపై ఈడీ, సిబిఐ’ల చేత దాడులు చేయిస్తూ జైలుకు పంపుతున్నారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అనేక త్యాగాలతో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహానుభావులు కళ ఇదా..? సెక్యులర్ పదాన్ని, దేశాన్ని కాపాడుకోవడానికి బహుజన సమాజ్ పార్టీకి మద్దతు తెలిపుతున్నామని,  దేశ భవిష్యత్తు ఎలా ఉండాలో వివరిస్తూ గ్రామ గ్రామాన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నామని పుణ్యమూర్తి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *