April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘన – పట్టించుకోని జిల్లా అధికారులు

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (మార్చి 24) ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ ఇన్చార్జి నీరుగట్టు నగేష్  సి.విజల్ యాప్ లోను, అలాగే జిల్లా కమాండ్ రూమ్ కు ఫిర్యాదు చేశారు. శనివారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలతోటి జరిగిన సమావేశం సందర్భంగా అనేకమంది రాజకీయవేత్తలు అలాగే ప్రతినిత్యం జిల్లాలో అధికారులు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కూడా ఇదే ప్రాంగణంలో ఉండి విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఎన్నికల కోడ్ వచ్చినా కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళే ప్రధాన ద్వారం వద్దనే శిలాఫలకం బోర్డు నందు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే పలువురు మంత్రులు ఎమ్మెల్యేల పేర్లతో శిలాఫలకం దర్శనమిస్తున్నాయి. అయినా దాన్ని ఇంతవరకు జిల్లా ఎన్నికల అధికారులు తొలగించకపోవడం చాలా నిర్లక్ష్యమని  ఇప్పటికైనా తిరుపతి జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి చొరవ తీసుకొని ఇలా నిర్లక్ష్యం చేసిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *