April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

నాయుడుపేటలో క్షయవ్యాధి నిర్మూలన ర్యాలీ

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (మార్చి 24) ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా నాయుడుపేట పట్టణంలో ఆదివారం నాయుడుపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, నాయుడుపేట టీబి యూనిట్  సంయుక్త ఆధ్వర్యంలో వైద్యులు,సిబ్బంది జాతీయ క్షయ నిర్మూలన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు   క్షయవ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. క్షయ వ్యాధి సోకిన వారికి డాట్ పద్ధతి ద్వారా ఆరు నెలలు ఉచిత చికిత్స తో పాటు మందులు అందిస్తున్నట్లు తెలిపారు. క్షయవ్యాధికి చికిత్స పొందే వారికి ప్రతినెల 500 రూపాయలు అందజేస్తున్నట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సలహాలు, సూచనలు తప్పక పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వికాస్, డాక్టర్ సుబ్బారావు,సూపర్ వైజర్ రమణయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *