April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

నీతి నిజాయితీ గల పౌరునికి టీడీపీ ఎల్లవేళలా పట్టం కడుతుంది: ఎమ్మెల్యే ఆదిమూలం

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి సత్యవేడు (మార్చి 24) నీతి నిజాయితీ గల పౌరుడుకి  తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా పట్టం కడుతుందని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు. వైసీపీ పార్టీలో ఆహ్వానం లేకపోయినా తెలుగు దేశం పార్టీ నాయకులు ఆహ్వానించారని, అక్కడ అగౌరవ పరచారని, కాని ఇక్కడ గౌరవించారని తెలిపారు. రాష్ట్రంలోని 150 ఎమ్మెల్యేలో ఏ ఎమ్మెల్యే తిరగలేనంతగా తిరిగి, నియోజకవర్గంలో 183 పంచాయతీలో 700 వందల గ్రామాల్లో ప్రతి ఇంటి బిడ్డగా, అన్నగా అందరిలో ఒకడిగా ప్రతి ఇంటి గడప తొక్కిన మహోన్నతమైన వ్యక్తికి వైసిపి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆహ్వానించి టికెట్ ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. నా నియోజకవర్గంలో ఉన్న సందుల్లో ఈ సంధు నుండి ఆ సంధు వరకు తెలిసిన వ్యక్తిగా, ప్రజా సంక్షేమ సారధిగా, ప్రతి ఒక్కరి కష్టాన్ని ఎరిగి ప్రతి ఒక్కరితో స్వరము కలిపిన ఆదిమూలం ని మరోసారి ఎమ్మెల్యే ని చేద్దామని నియోజకవర్గ ప్రజలు మరింత ఉత్సాహాన్ని కలిగి ఉన్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *