April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

చీకటి వ్యాపారాలు చేసి ఏపీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు

1 min read

 

భీమ్ న్యూస్ ప్రతినిధి కుప్పం (మార్చి 25) తెలుగుదేశం అధినేత చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రెండ్రోజుల పర్యటనకు వచ్చారు. ఇవాళ కుప్పంలో మహిళలతో ముఖాముఖి సమావేశం అయ్యారు. దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని తెదేపా  అధినేత చంద్రబాబు  అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. డబ్బుకు కక్కుర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా?అని ప్రశ్నించారు. తెదేపా హయాంలో అక్రమార్కులు రావడానికే భయపడ్డారని చెప్పారు. చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.

”దేశంలో ఆడబిడ్డల గురించి మాట్లాడిన తొలి పార్టీ తెదేపా. వారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోతే పోరాడి కోర్టుకు వెళ్లి తెచ్చుకునే హక్కు కల్పించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చాం. 2 కోట్ల మంది ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా.. మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తా. జగన్‌ మాదిరిగా రూ.10 ఇచ్చి.. రూ.100 లాగడం కాదు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతాం. అవసరమైతే ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం” అని చెప్పారు. కుప్పంలో లక్ష మెజార్టీ సాధించేందుకు తెదేపా కార్యకర్తలు కృషి చేయాలని.. అదే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 75 శాతం ఓట్లు పడేలా పనిచేయాలని చెప్పారు. వైకాపాకు ఓటు వేయాలని అడిగిన వారికి కర్రు కాల్చి వాత పెట్టాలని వ్యాఖ్యానించారు. తెదేపా కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *