32వ వార్డు నుండి భారీగా టీడీపీ లోకి చేరికలు
1 min read
భీమ్ న్యూస్ ప్రతినిధి కావలి (మార్చి 25) టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ అద్యక్షతన 32వ వార్డు ఇంచార్జి పల్లపు కుమార్ సమక్షంలో దివంగత మాజీ కౌన్సిలర్ మల్లి ఆంజనేయులు కుమారుడు మల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు వారి అనుచరులు పెద్ద ఎత్తున వైసిపి నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పసుపులేటి అనుచరులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంజి ఏడుకొండలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి అనుచరులు, కుటుంబ సభ్యులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. షేక్ హుస్సేన్ షేక్ రషీద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు..కావలి పట్టణంలోని 32వ వార్డులో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో కావలి టిడిపి – జనసేన – బిజెపి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి పార్టీ కండువా కప్పి అందరిని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు క్లస్టర్ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటేశ్వర్లు, కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబూరావు, మాజీ కౌన్సిలర్ కమర్ బాబు, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.