వైసీపీకి రాజీనామా చేసిన కైలాసం శ్రీనివాసులు రెడ్డి దంపతులు
1 min read
భీమ్ న్యూస్ ఇందుకూరుపేట ప్రతినిధి (మార్చి 26) నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యులు, ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి వైకాపాకి నేడు రాజీనామా చేశారు. తన ప్రాథమిక సభ్యత్వం మరియు కోవూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యుడిగా రాజీనామా చేశారు. శ్రీనివాసులు రెడ్డి సతీమణి కైలాసం లావణ్య కూడా పార్టీలో తన ప్రాథమిక సభ్యత్వం మరియు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేశారు. తమ వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. ఈ వరుస రాజీనామాలు మండలంలో కలకలం రేపాయి. గత రెండు నెలల నుండి ఇందుకూరుపేట మండలం రాజకీయ పార్టీల్లో మార్పులు చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఏ పార్టీలో ఎవరు నిలబడతారో తెలియని గందరగోళ వాతావరణం ఏర్పడుతోందని మండల ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.