April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా దేశం

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి న్యూఢిల్లీ (మార్చి 26) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై మరో దేశం స్పందించింది. ఆయన అరెస్టుపై న్యాయమైన, పారదర్శక విచారణ జరగాలని ఆమెరికా పేర్కొంది. కేజీవాల్ అరెస్టు అంశాలను తాము సునిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఇప్పటికే ఆయన అరెస్టు విషయంలో జర్మనీ స్పందించిన విషయం తెలిసిందే. దానిపై భారత ప్రభుత్వం కూడా ఘాటుగానే ప్రతి స్పందించింది. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు రాబోయే ఎన్నికల్లో దేశంలో ఈవీఎంలు కు బదులుగా బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపక్షాలు ఓవైపు పట్టు పడుతూ ఉన్నాయి. బాగా అభివృద్ధి చెందిన, సాంకేతిక నైపుణ్యత సాధించిన అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, జపాన్, చైనా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా తదితర దేశాలలో ఈవీఎంలు ఉపయోగించకుండా బ్యాలెట్ పేపర్ లోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉంటే భారతదేశంలో మాత్రం ఈవీఎం లు ఉపయోగించడం ఏమిటని ప్రజలు, ప్రతిపక్షాలు ఏకతాటిపై నిలుస్తున్నాయి. ఈ అంశం పట్ల  ఆయా దేశాల్లో చర్చ జరుగుతున్నట్లు కూడా పరిశీలన జరుగుతుందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *