శ్రీ సిటీలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలి : ఎంటెక్ బాబు, గౌస్ మొహిద్దిన్
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి సత్యవేడు (మార్చి 26) తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో శ్రీ సిటీలో ఉన్న పరిశ్రమలలో 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనికాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశావహ అభ్యర్థి ఎంటెక్ బాబు మరియు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు గౌస్ మొహిద్దిన్ మంగళవారం తెలిపారు. సత్యవేడు నియోజకవర్గం గ్రామాలలో పర్యటించి నిరుద్యోగుల సమస్యలు తెలుసుకొని నియోజకవర్గంలో ఉండే శ్రీ సిటీలో ఏడు మండలాల స్థానికులకు (నిరుద్యోగులకు) 75 శాతం ఉద్యోగలు ఇవ్వాలని పరిశ్రమల యాజమాన్యానికి పత్రికా రూపంగా సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశావహులు ఎంటెక్ బాబు మరియు మైనార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎస్కే గౌస్ మొయిద్దీన్ తెలియజేశారు. మన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే మాట తప్పకుండా స్థానికులకు 75 శాతం స్థానికులుగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీని పత్రికా రూపంగా ఎంటెక్ బాబు( కె. వీరాస్వామి బాబు)తెలియజేశారు.