April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

సేవ్ వెంకటగిరి సమావేశం నిర్వహించిన మెట్టుకూరు ధనుంజయ రెడ్డి

1 min read

 

     భీమ్ న్యూస్ ప్రతినిధి వెంకటగిరి (మార్చి 26) వెంకటగిరి వైసీపీలో వర్గపోరు ఇటీవలి కాలంలో తారాస్థాయికి చేరింది. వైసీపీ ఇన్‌చార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిపై సొంత పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత చూపుతూ ప్రత్యక్ష పోరుకు ధనుంజయ రెడ్డి,రాం ప్రసాద్ రెడ్డి లు దిగారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియోజకవర్గానికి చెందిన నేతలు కలిశారు. మంత్రిని కలిసిన వారిలో ఆరు మండలాల సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. వెంకటగిరిలో వైసీపీ ఇన్‌చార్జి నేదురుమల్లిని మార్చాలని మంత్రి పెద్దిరెడ్డిని వైసీపీ నేతలు కోరారు. నేదురుమల్లికి టికెట్ ఇస్తే వైసీపీకి తాము పని చేయబోమని సదరు నేతలు మంత్రి పెద్దిరెడ్డికి తేల్చి చెప్పారు. నేదురుమల్లికి టికెట్ ఇస్తే నియోజకవర్గంలో వైసీపీకి ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపై సానుకూలంగా స్పందించేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్క రోజు గడువు కోరారు. కానీ అధిష్టానం వెంకటగిరి టికెట్ రాం కుమార్ రెడ్డి కి ఇవ్వడం తో ధనుంజయరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాస్తవాలు జగనన్న కు చెప్పండి లేకుండా ఉంటే వెంకటగిరి సిటు కోల్పోవల్సి వస్తుందనీ ధనుంజయరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం రోజున వెంకటగిరిలో సేవ్ వెంకటగిరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని కొనసాగిస్తే తాము ప్రత్యామ్నాయాన్ని చూసుకోక తప్పదని హితవు పలికారు. వెంకటగిరి అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని కొనసాగిస్తే తాముప్రత్యామ్నాయాన్ని చూసుకోక తప్పదని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ్ రెడ్డి హెచ్చరించి రామ్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. వెంకటగిరిలో వైసీపీ సమన్వయ కర్తగా ఉన్న రామ్ కుమార్ రెడ్డిపార్టీలోని నాయకులు, కార్యకర్తలను విస్మరించారని తెలిపారు. స్వంత పార్టీ నేతలపై కేసులు పెట్టారని వెల్లడించారు. పార్టీ కోసం పని చేసే వ్యక్తులు రామ్ కుమార్ వెంట లేరని తెలిపారు. స్థానిక సమస్యలపై స్పందించని వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవలేరని జోష్యం చెప్పారు. రామ్ కుమార్ రెడ్డి స్వంత బలగాన్ని తయారు చేసుకొని పరిపాలన సాగించారని తెలిపారు. రామ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగిస్తే వెంకటగిరిలో వైసీపీ గెలవడం కష్టమని ధనుంజయ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *