పొగాకు బ్యార్ని దగ్దం
1 min readభీమ్ న్యూస్ మర్రిపాడు ప్రతినిధి (మార్చి 27) నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రంలోని పొగాకు బ్యార్ని దగ్ధమైంది. అధిక వేడి ప్రభావం వలన పొగాకు అకు టైర్ల మీద పడడంతో బ్యార్నిలో మంటలు చెలరేగాయి. దీంతో 1.50 లక్ష రూపాయల పొగాకు ఆకు అగ్నికి ఆహుతి అయి పూర్తిగా దెబ్బతిన్నది. సోమల వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు లకు చెందిన పొగాకు బ్యార్ని గా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పైర్ సిబ్బంది సకాలంలో స్పందించి పొగాకు బ్యార్ని లో చెలరేగిన మంటలను అదుపు చేశారు. పొగాకు బ్యార్ని పూర్తిగా దెబ్బతిని నష్టపోయిన పేద రైతులను ప్రభుత్వం వారు అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు మీడియా ముఖంగా కోరుతున్నారు.