గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (మార్చి 27) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట అంగన్వాడి కేంద్రం నందు అంగన్వాడీలకు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుబ్బరత్తమ్మ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గర్భిణీ స్త్రీలను బాలింతలను రక్తహీనత నుండి కాపాడడం మనందరి లక్ష్యం అని, రక్తహీనతతో బాధపడే వారు ప్రధానంగా పేలవమైన మానసిక తీరు అలసట పేలవమైన ఆకలి మొదలైన సాధారణ వస్తువులు తినాలనే కోరిక ఇలాంటి లక్షణాలు ఉంటాయని, వీటిని గమనించాలని గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కలిగించటంతో పాటు శుక్రోస్ ఇంజక్షన్స్ వేయించాలని ఆకుకూరలు కూరగాయలపై అవగాహన కలిగించి, వారు విరివిగా తీసుకునేటట్లు చూడాలని, ఐరన్ ఫోలిక్ మాత్రలును మింగించడంతో పాటు డాక్టర్స్ ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ ఉండాలని అరోగ్య అధికారి డాక్టర్ బ్రహ్మేశ్వర్ నాయుడు, డాక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. హై రిస్క్ కేసులను గుర్తించాలని హిమోగ్లోబిన్ స్థాయి ఎప్పటికప్పుడు గర్భిణీ స్త్రీలకు అరోగ్య పరీక్షలు చేయిస్తూ వుండాలని హెల్త్ ఎడ్యుకేటర్ సుధాకర్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ ఆఫీసర్ చంద్రశేఖర్, హెల్త్ అసిస్టెంట్ మాధవ, సిహెచ్ఓ నందిని, ఏఎన్ఎం శ్రీ కల్పవల్లి, హెల్త్ సెక్రటరీ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.