మీ ఇంటి ఆడబిడ్డగా వస్తున్నా – నన్ను ఆశీర్వదించండి
1 min read
భీమ్ న్యూస్ కోవూరు ప్రతినిధి (మార్చి 28) నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం మోడేగుంట పంచాయితీ మోడేగుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ మీ ఇంటి ఆడ బిడ్డగా వస్తున్నాను, నన్ను ఆశీర్వదించాలని కోరారు. తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని, మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామనీ గుర్తు చేశారు. సి.ఎం. గా నారా చంద్రబాబు నాయుడును, నెల్లూరు ఎం.పిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంతి రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, గుడి హరికుమార్ రెడ్డి, పుట్టా పద్మ, వసంతపురం జీవ, భాస్కర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.