మున్సిపల్ కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వండి : కమిషనర్ కు మున్సిపల్ కార్మికులు వినతి
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (మార్చి 28) తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ కార్మికులకు గత మూడు నెలల నుండి వేతనాలు చెల్లింపులు ఆలస్యం కావడంతో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చాపల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు కమిషనర్ జనార్దన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు .ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చాపల వెంకటేశ్వర్లు కార్మికుల వేతనాలు తదితర సమస్యలపై కమిషనర్ తో చర్చలు జరిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి కార్మికుల వేతనాలను ఏప్రిల్ నెల మొదటి వారంలో చెల్లిస్తామని, సాంకేతిక కారణాలతో జీతాలు చెల్లింపులు ఆలస్యమయ్యాయని తెలిపారు . కార్మికులకు యూనిఫామ్, పాదరక్షకులు, సబ్బులు, నూనె, కార్మికులకు నివేశ స్థలాలు కూడా ఇస్తామని తెలిపారు. సమ్మె కాలపు ఒప్పందాలను కూడా అమలు చేస్తామని మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు మధు, కర్ర లచ్చమ్మ, రమణమ్మ, నెలవల మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.