December 2, 2024

BHIM NEWS

Telugu News Channel

నాయుడుపేటలోఈ నెల 30న ప్రజాగళం భారీ బహిరంగ సభ

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (మార్చి 28) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా ఈ నెల 30న తిరుపతి జిల్లా నాయుడుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఏఎల్ సిఎం ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో హెలిపాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి  తదితరులు పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాగళం సభను టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *