April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

పట్టణ ప్రజలు త్రాగునీరు వృధా చేయవద్దు: నాయుడుపేట మున్సిపల్ కమీషనర్

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట ( మార్చి 28) తిరుపతి జిల్లా నాయుడుపేటలో పట్టణ ప్రజలు వేసవి కాలము మొదలవుతున్న కారణంగా భూగర్భ జలాలు అడుగంటి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కమిషనర్ జనార్దన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నాయుడుపేట పురపాక సంఘం పరిధిలో సుమారు 52 త్రాగునీరు బోర్వెల్స్ ద్వారా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. వర్షా బావ పరిస్థితి వలన రాబోవు 3నెలల్లో భూగర్భ జలాలు అడుగంట్టే పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, తిరుపతి జిల్లా కలెక్టర్ పట్టణ మున్సిపాలిటీ కార్యాలయానికి తెలియజేశారు. అందుకోసం పట్టణ ప్రజలు త్రాగు నీటిని వృధా చేయకుండా పొదుపు చేయాలని కోరారు. పట్టణంలోని ఉన్నటువంటి వీధి కుళాయిలు ద్వారా నీరు వృధా కాకుండా కొళాయిలు అమర్చుకోవాలని తెలిపారు. అంతేకాకుండా వీధి కొళాయిల వద్ద అవసరం మేరకు నీరును వినియోగించుకొని వెంటనే కులాయిలను ఆపుకోవాలని తెలిపారు.పట్టణంలో ఇంటి కుళాయిల యజమానులు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోవు 3 నెలల్లో  (ఏప్రిల్-మే-జూన్)  మీ ఇంటి ముందు రోడ్డును కడగటం వాహనాలను కడగటం చేయకూడదని,వాటర్ ట్యాంకుకు మోటర్ వేసినప్పుడు నిండిన వెంటనే ఆఫ్ చేయాలని తెలిపారు. అలాగే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద చలివేంద్రను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నాయుడుపేట పురపాలక సంఘము వారి సూచనలతో దృష్టిలో ఉంచుకొని రాబోవు భవిష్యత్తు తరాల వారికి త్రాగునీరు అందించాలని ” సేవ్ వాటర్-సేవ్ ఫీచర్” అనే నినాదాన్ని అందరికీ తెలియజేయాలని కోరడమైనదని తెలిపారు. కావున పట్టణ ప్రజలు పురపాలక సంఘం వారికి సూచనలు తప్పక పాటించాలని లేనియెడల చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఏర్పడినప్పుడు  అసిస్టెంట్ ఇంజనీరు ఫోన్ నెంబర్ 8500845554,, వాటర్ సప్లై ఇన్చార్జ్ 9849742056 తదితరుల ఫోన్ నెంబర్లకు తెలియజేస్తే అక్కడికి వచ్చి సమస్యను తక్షణం పరిష్కరిస్తారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *