అలిపిరిలో చిరుతపులి సంచారం – భక్తులు అప్రమత్తంగా ఉండాలి: టిటిడి
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి తిరుమల (మార్చి 28) తిరుమలలోని అలిపిరి బాటలో మరో చిరుతపులి కనిపించింది. దీంతో కొండకు వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో నడక మార్గంలో చిరుత కదలిలు కనిపించినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి బోన్లను ఏర్పాటు చేశారు. కాలినడకన వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది.