April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

జగన్ కు మళ్లీ చాన్స్ ఇస్తే ఉద్యోగులను అడవిలో వదిలేస్తాడు: చంద్రబాబు

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి రాప్తాడు (మార్చి 29)  ప్రజాగళం యాత్రలో భాగంగా రెండోరోజు చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం పని అయిపోయిందన్నారు. రాష్ట్రం విధ్వంసం పాలయిందని, పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని ప్రజల్ని కోరారు. రాప్తాడు రోడ్ షో లో సీఎం జగన్ కి చంద్రబాబు 7 ప్రశ్నలు సంధించారు.

1. ప్రత్యేక హోదా ఏది జగన్..? :

ఒక్క ఛాన్స్ పేరుతో  ప్రత్యేక హోదా సాధన కోసం  అధికారం ఇవ్వాలని 25 మంది ఎంపీలతో ప్రత్యేక హోదా సాధిస్తానని పోలవరం కడతానని రకరకాల కల్లలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసిపి కనీసం ఒక్కటి కూడా నెరవేర్చలేకుండా పోయిందని విమర్శించారు.

2. సీపీఎస్ రద్దు ఏమైంది..?

ఎన్నికల ముందు సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ చెప్పిన మాట . అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) పునరుద్ధరించడం సాధ్యం కాదని, కేంద్ర ప్రభుత్వ విధానాలు అడ్డుగా ఉన్నాయని, కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదురవుతాయని రకరకాల మోసపూరిత మాటలతో చేష్టలతో సిపిఎస్ అటుకెక్కిందని అన్నారు .   జీపీఎస్ పేరుతో కొత్త నాటకంతీసుకొచ్చారని ఉద్యోగులు ఒప్పుకున్నారని, కల్లబొల్లి మాటలతో ఉద్యోగులను మోసం చేశాడని చంద్రబాబు  దుయ్యబట్టారు. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు పరిస్థితి ఉద్యోగులను అడవిలో వదిలేసినట్లుగా ఉందని అన్నారు.

3. మద్యపాన నిషేధం ఏమైంది..?

మద్యపాన నిషేధం పూర్తి స్థాయిలో అమలు చేయలేదు . జై బ్రాండ్స్ పేరుతో రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు వాటి ద్వారా లాభాలు జగన్  పొందాడని అన్నారు. తాను అధికారంలోకి వస్తే మంచి మంచి బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

4. ఏటా జాబ్ క్యాలెండర్.. ఏది?

జగన్ హయాంలో గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్స్..  నోటిఫికేషన్లు విడుదల చేసి ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ఏటా ఉద్యోగం కోసం ఎదురు చూసి10 లక్షల మంది యువత భవిష్యత్తు నాశనం అయిందని అన్నారు.

5. మెగా డీఎస్పీ ఎక్కడ? :   

ఏడాదికి ఒక మెగా డీఎస్సీ పేరుతో ఐదేళ్లు అరచేయి చూపించాడని ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చిన దాఖలు లేవని అన్నారు. నాడు-నేడు పనులతో స్కూళ్ల రూపు రేఖలు మారుస్తామని చెప్పి లక్షల కోట్లు ఖర్చుపెట్టి వైసిపి నాయకులకు చేరే విధంగా చేశారన్నారు.    రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలన్నీ మూతపడి ఏకోపాద్యయ పాఠశాల ఎక్కువైనాయని అన్నారు.    

6. కరెంట్ చార్జీలు తగ్గింపు ఎక్కడ.?

రాష్ట్రంలో ఏడుసార్లు కరెంటు చార్జీలు ఏడుసార్లు బస్సు చార్జీలు పెంచిన దాఖలాల ఘనత ఒక జగన్  కే దక్కుతుందనితెలిపారు.

7. పోలవరం ఎప్పుడు..?

ఈ 7 ప్రశ్నలకు జగన్ సమాధానాలు దమ్ముంటే చెప్పగలరా అని  చంద్రబాబు సవాల్ విసిరారు.      రాష్ట్రంలో పోలవరం పూర్తి చేస్తానని చెప్పి ఐదేళ్లు పూర్తయిన ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు . రాష్ట్రంలో భూగర్భ వనరులు తరిగిపోయాయని ఇంకో ఛాన్స్ పేరుతో అధికారం ఇస్తే ఈ రాష్ట్రం అడవిలా మారిపోతుందని అన్నారు. రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని తాగునీటి సదుపాయం పూర్తిగా లేదని నవరత్నాలు పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి బ్రష్టు పట్టించారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *