స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తెలుగు దేశం పార్టీలో చేరిక.
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి విజయవాడ (మార్చి 29) ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తెలుగు దేశం పార్టీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిఖిల్ కు కండువా కప్పి టీడీపీ లోకి ఆహ్వానించారు. కార్తికేయ-2 సినిమాతో నిఖిల్ పాన్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్నారు. 18 పేజెస్, స్పై చిత్రాలతో అలరించారు. హ్యాపీ డేస్ మూవీతో హిట్ అందుకున్న ఈ యువ హీరో విభిన్న కథలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ లో దూసుకెళ్తున్నారు.