April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

జై భీమ్ రావ్ భారత్ పార్టీ మూడవ లిస్టు విడుదల

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి విజయవాడ (మార్చి 29) జై భీమ్ రావ్ భారత్ పార్టీ మూడవ లిస్టు  అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ మీడియా రిలీజ్ చేశారు. 20 మంది ఎమ్మెల్యేలు ఏడుగురు ఎంపీలతో లిస్టు రిలీజ్ ప్రకటించారు. 175 ఎమ్మెల్యే 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనున్న జై భీమ్ రావ్ భారత్ పార్టీ పోటీలో ఉంటుందని, ఇప్పటికే 125 ఎమ్మెల్యే 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఎంపికయ్యారని, 175 ఎమ్మెల్యే 25 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 10వ తారీకున చివరి లిస్ట్ విడుదల అవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ టికెట్లు కేటాయించామని జై భీమ్ రావ్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ చెప్పారు. మహిళలకు 20 శాతం సీట్లు కేటాయించారు. ఎస్సీలకు 60 శాతం సీట్లు కేటాయించిన పార్టీ జై భీమ్ రావ్ భారత్ పార్టీ ప్రకటించింది అన్నారు. ముస్లింలకు, బీసీలకు అత్యధిక స్థానాలు కేటాయించిన పార్టీ జై భీమ్ రావ్ భారత్ పార్టీ మాత్రమేనని, రానున్న ఎన్నికల్లో గెలుపు ఓటములను తీవ్రంగా ప్రభావితం చేయనున్న జై భీమ్ రావు భారత్ పార్టీ ఒకటని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారికంగా కోటు గుర్తుని కేటాయించడంతో ఆనందంలో పార్టీ వర్గాలంటున్నాయి అని తెలిపారు. మంగళగిరి మరియు తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *