April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

నెల్లూరు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా క్రైస్తవ యువ నాయకుడు

1 min read

భీమ్ న్యూస్ వరికుంటపాడు ప్రతినిధి (మార్చి 29) నెల్లూరు పార్లమెంటు నుండి యునైటెడ్ క్రిస్టియన్స్ ఆఫ్ ఇండియా (యూ.సి.ఐ.) ఆం.ప్ర రాష్ట్ర యూత్ అధ్యక్షులు ఓబుళాపురం దేవానంద్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల బరిలో గెలవక పోయినా 2 లక్షల 70 వేల నుండి 2 లక్షల 80 వేల ఓట్లు సాధించి జిల్లాలో క్రైస్తవుల శక్తి ఏమిటో చూపిస్తామని సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లాలో 3412 చర్చీలు 5839 మంది సేవకులు, అందులో 769 చర్చీ కాపరులు యూసిఐ లో సభ్యత్వం కలిగియున్నారని తెలియజేశారు. ఎన్నికల ప్రకటన వచ్చినా ఇప్పటివరకు ఎవరు కూడా క్రైస్తవుల గురించి మాట్లాడకపోగా, క్రైస్తవ నాయకులను, ఫెలోషిప్ లను కాదని ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో వారి దగ్గర చెంచాగిరి చేసేవారితోనే అన్ని పంపిణీలు జరుపుతూ క్రైస్తవ నాయకులను అవమానిస్తున్నారని అన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జిల్లాలో క్రైస్తవ ప్రజల ఇబ్బందులు గుర్తించే విధంగా లేరన్నారు. యూసిఐ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందుకే ఖచ్చితంగా తనే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు పార్లమెంటు అభ్యర్థులుగా ఉన్న ఇరు పార్టీల నాయకులకు క్రైస్తవులంటేనే చిన్నచూపు ఉన్నట్లు అర్థమవుతోందని, జిల్లాలో క్రైస్తవుల ఐక్యత చాటి చెప్పడానికి ఇదో గొప్ప అవకాశమని సంఘ కాపరులకు తెలియజేశారు. అలాగే సోదర సమానులైన ముస్లీం మైనారిటీ సోదరులతో పోటి విషయం చర్చలు జరుపగా వారి నుంచి కూడా స్పందన బాగుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *