April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పై సస్పెన్షన్ వేటు

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి కదిరి అర్బన్ (మార్చి 29)  పాఠశాలలో నాడు నేడు పథకంలో మిగిలిపోయిన ఇనుప కడ్డీలను అక్రమంగా అమ్ముకునేందుకు యత్నించిన ప్రధానోపాధ్యా యుడు సస్పెండ్ అయ్యాడు. కదిరి మండలం సున్నపుగుట్ట తండా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ డీఈఓ మీనాక్షి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25న రాత్రి పాఠశాలలోని ఇనుప కడ్డీలను వాహనంలో వేసుకుని గుజిరీ దుకాణంలో విక్రయించేందుకు శ్రీనివాసులు ప్రయత్నించాడు. గ్రామస్తులు అడ్డుకోవడంతో విషయం బయట పడింది. తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ గ్రామస్తులతో పంచాయితీ చేసి, కడ్డీలను పాఠశాలలోనే వదిలేసి, శ్రీనివాసులుపై ఎలాంటి చర్యలు లేకుండా చేసేందుకు ప్రయత్నించడం గమనార్హం. ఆఖరికి హెచ్ఎం సస్పెండ్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *