April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

ఆదివారం యథావిధిగా బ్యాంకు సేవలు !

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ (మార్చి 29) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎల్లుండి (ఆదివారం)తో ముగియనున్న నేపథ్యంలో దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ 33 బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలతో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సహా 20 ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకు డీబీఎస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లు ఆదివారం సెలవు దినమైనప్పటికీ సాధారణంగానే పనిచేస్తాయి. నెఫ్ట్, ఆర్టీజీఎస్‌తో పాటు చెక్ క్లియరెన్స్ వంటి సేవలు యథాతథంగా కొనసాగుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *