ఎన్నికల సంఘం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిలను అనర్హులుగా ప్రకటించాలి
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి చంద్రగిరి ( మార్చి 29) అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోడ్ వర్తించదా అని జనసేన చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జి దేవర మనోహర్ ప్రశ్నించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రేణిగుంట మండల పరిధిలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాములలో దాదాపు 45 కోట్ల విలువైన ఓటరు ప్రభావిత బహుమతులు మరియు ప్రచార సామాగ్రిని ఎన్నికల అధికారులు సీజ్ చేయడం జరిగిందన్నారు. వీటిని గుర్తించి ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చిన ప్రతిపక్ష పార్టీలపై కేసులు బనాయించడానికి విఫల ప్రయత్నాలు చేశారన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 45 కోట్లతో ప్రజా ప్రయోజనమైన అభివృద్ధి పనులు చేసి ఉండొచ్చు కదా అని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హితవు పలికారు. వెంటనే ఎన్నికల సంఘం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అనర్హులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. టిడిపి నేత దొడ్ల కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కోసం డబ్బులు వెచ్చించడం కన్నా ప్రచారాలకు చెవిరెడ్డి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తానన్నారు. తుడా నిధులను మండలాలకు మార్పిడి చేసి అధికారులను ఉచ్చులో ఇరికించారని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో మండల నాయకులు తపసి మురళి, కిషోర్, హరీష్, సాయి తదితరులు పాల్గొన్నారు.