April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

బొజ్జల సుధీర్ రెడ్డితో తిరుపతి పార్లమెంటు అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ భేటీ.

1 min read

 

                  భీమ్ న్యూస్ ప్రతినిధి శ్రీకాళహస్తి (మార్చి 29) తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిని తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్, తిరుపతి పార్లమెంట్ బీజేపీ అధ్యక్షులు చంద్రప్ప తదితరులు కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి దంపతులను శాలువాతో సన్మానించి అభినందించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపిలో కలిసి భారీ మెజార్టీతో గెలిచే విధంగా కూటమిలోని అన్ని పార్టీలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *