December 2, 2024

BHIM NEWS

Telugu News Channel

ప్రశాంతి రెడ్డికి కుడితిపాలెం దొడ్ల మల్లిఖార్జున మిత్రబృందం మద్దతు

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (మార్చి 30) నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం మొత్తలు వద్ద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ గురువారం మధ్యాహ్నం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొవూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, టీడీపి అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కుడితిపాలెం యువ నాయకులు దొడ్ల మల్లిఖార్జున తన మిత్ర బృందం ప్రశాంతి రెడ్డికి మద్దతుగా ఉంటాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొన్నెబోయిన చెంచు కిషోర్ యాదవ్, మాజీ ఎం.పి.టి.సి. పుట్టా పద్మ, ఇందుకూరుపేట మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *