April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

గీతాంజలి కళాశాలలో ఎన్నికల అవగాహన కార్యక్రమం

1 min read

 

భీమ్ న్యూస్ కోవూరు ప్రతినిధి (మార్చి 30) నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం గంగవరం వద్ద నున్న గీతాంజిలి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సేధు మాధవన్ మాట్లాడుతూ ఎస్.వి.ఈ.ఈ.పి. యొక్క పూర్తి అర్థం సిస్టమాటిక్ ఓటర్ విద్య మరియు ఎన్నికల భాగస్వామ్యం యొక్క లక్ష్యాలు ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఓటరు హెల్ప్ లైన్ నంబర్ 1950 ను ప్రతీ ఒక్క ఓటరు గుర్తు పెట్టుకోవాలన్నారు. దృఢమైన ప్రజాస్వామ్యానికి తప్పనిసరిగా ఓటు వేద్దాం ప్రజాస్వామ్యవాదాన్నీ నిర్మిద్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *