శ్రీశ్రీశ్రీ కొత్తమ్మతల్లి దేవాలయం ప్రారంభోత్సవంలో దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ లు.
1 min read
భీమ్ న్యూస్ కోట బొమ్మాళి ప్రతినిధి (మార్చి 30) శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలం కార్యకర్తల ఆత్మీయ సమావేశం అనంతరం కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు పంచాయతీ ఊడుకులపాడు గ్రామంలో శ్రీశ్రీశ్రీ కొత్తమ్మతల్లి నూతన దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి టెక్కలి నియోజకవర్గం అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ అభ్యర్థి పేరాడ తిలక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైయస్ఆర్ సిపి పార్టీ మహిళా అధ్యక్షురాలు చింతాడ మంజు, మండల పార్టీ అధ్యక్షులు కిల్లి అజయ్, జే.సి.ఎస్. కన్వీనర్ శిగిలిపల్లి మోహన్ రావు, యువజన అధ్యక్షులు మురళీ, పేస్ అధ్యక్షులు సత్తారు సత్యం, టెక్కలి టౌన్ అధ్యక్షులు తమ్మన్న కిరణ్, టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ గొండేల సుజాత, పలువురు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.