April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

చిల్లకూరు మండలంలో 100 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక

1 min read

 

భీమ్ న్యూస్ ప్రతినిధి చిల్లకూరు (మార్చి 30) తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని తిక్కవరం, ముత్యాలపాడు, నాంచారం పేట గ్రామాల నుండి ఆయా గ్రామాల నాయకుల ఆధ్వర్యంలో 100 వైసీపీ కుటుంబాల వారు టిడిపిలో చేరారు. వారిలో ముత్యాలపాడు పంచాయతీ నాయకులు పెజ్జయి ప్రవీణ్ రెడ్డి, మద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మధురెడ్డి, సర్పంచ్ శనగ హరిత, వార్డు మెంబర్ హిమామ్ బాషా, చిరంజీవి, మణికంఠ, సుధాకర్ లు ఉన్నారు. అదే విధంగా తిక్కవరం గ్రామం నుండి దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, సాగునీటి సంఘ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మందపాటి లింగా రెడ్డి, మురళి రెడ్డి, ఉప సర్పంచ్ ఆవుల ప్రభాకర్, సుధాకర్ రెడ్డి, గంగాదర్ రెడ్డి, రమేష్ రెడ్డి, సుమంత్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రాధా రెడ్డి లు టిడిపి చేరారు. మరియు తొనుకుమాల గ్రామం నుండి సర్పంచ్ బొమిళ్ల త్రివిక్రమ్ భూపతి రావు, ఉపసర్పంచ్ అరిపినేటి విజయ్ భాస్కర్, వార్డు మెంబర్లు షమీమ్, మధు, సుబ్బారావు, వెంకటయ్య, ప్రభావతి, సీనియర్ నాయకులు మొగలిగుంట మస్తాన్ లు టిడిపి లో చేరారు. వీరికి పాశం సునీల్ కుమార్ టిడిపి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు శీలం కిరణ్ కుమార్, నెలబల్లి భాస్కర్ రెడ్డి, సన్నారెడ్డి వెంకటరమణ రెడ్డి, అధ్యక్షులు వి.వెంకటేశ్వర రెడ్డి,భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు నాయుడు, లీలావతి, మునిశేఖర్ గౌడ్, కుమార్, కీరవాణి, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. 5వ వార్డుకు చెందిన చింతపర్తి అన్నపూర్ణమ్మ టిడిపిలో చేరారు. గూడూరు పట్టణం లోని 5వ వార్డు నందు 2 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన చింతపర్తి అన్నపూర్ణమ్మ ను పాశిం సునీల్ కుమార్ టిడిపి లోకి ఆహ్వానించి టిడిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వాటంబేటీ శివకుమార్, పుచ్చలపల్లి చంటి, నాయకులు పూడిపర్తి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *