ఎన్నికల కోడ్ అమలులో ఉండగా దళిత తేజం శిలాఫలకం ధ్వంసం
1 min read
భీమ్ న్యూస్ ప్రతినిధి చిట్టమూరు (మార్చి 30) తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గునపాడు గ్రామంలోని దళిత వాడలో శనివారం రోజున చిన్నపాటి గుడికి సంబంధించిన ఆవరణంలోని 2015 లో టిడిపి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కట్టించిన దళిత తేజం శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా గ్రామంలో ఇటువంటి చర్యలు చేపట్టడం వర్గ వైషమ్యాలకు దారితీస్తుందని కొంతమంది గ్రామస్తుల ఆవేదన చెందుతున్నారు. శాంతి భద్రతలతో మెలగాల్సిన సమయంలో కొందరు శిలాఫలకాన్ని ధ్వంసం చేసి గ్రామంలో వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని గ్రామస్తులంటున్నారు. ఇటువంటి చర్యల పట్ల గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏ విధమైన వైషమ్యాలకు పోవద్దని కొంతమంది సీనియర్ సిటిజన్స్, మహిళలు, వృద్ధులు తదితరులు తెలిపారు. ఏదిఏమైనా ఎన్నికల సమయంలో ఇటువంటి అనాలోచిత చర్యల వల్ల వర్గ వైషమ్యాలతో గొడవలు జరిగే ప్రమాదం తీవ్రంగా ఉందని ఈ విషయంపై సంబంధిత పోలీస్ శాఖ వారు తక్షణం విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరారు.