April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

ఇల్లు కాలిన బాధిత కుటుంబానికి కోగిలి టిడిపి నేత ఆర్ధిక సాయం అందజేత

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి చిట్టమూరు (మార్చి 30) తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలో గ్యాస్ సిలిండర్ పేలి పూరిల్లు దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని కోగిలి పంచాయతీలో శుక్రవారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇల్లు దగ్ధమై నగదు, రెండు క్వింటాళ్ల బియ్యం, పట్టాపాసు పుస్తకాలు, బట్టలు, నిత్యావసర వస్తువులు కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు ఎస్కే ఖలీల్ భాషా నిరుపేద కుటుంబానికి నిత్య అవసమైనా దుస్తులు, బియ్యం, నగదు ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. అనంతరం ఎస్కే ఖలీల్ మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి భాధితులకి జరిగిన నష్టాన్ని అంచనా వేసి  నస్టపరిహారం తక్షణమే అందజేయలని కోరారు. రానున్న ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాలనీ ఇల్లు మంజూరు చేయించి ఇస్తానని భరోసా ఇచ్చారు. తన వంతు సహాయంగా స్పందించి ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎస్కే ఖలీల్ భాషా కి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *