కోగిలి గ్రామంలో ఇల్లు పూర్తిగా దగ్ధం: నిరాశ్రయమైన కుటుంబం
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి చిట్టమూరు (మార్చ్ 30) తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కోకిల గ్రామం లో రాయపు రమణమ్మ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెల రేగాయి మంటలు ఆర్పుటకు ఊరు గ్రామస్తులు ప్రయత్నం చేయగా ఇల్లు పూర్తిగా మండిపోయింది. వీలు కాని పక్షంగా వెనువెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బందికి విషయాన్ని తెలియపరిచారు. విషయం తెలుసుకున్న ఫైర్ స్టేషన్ పోలీస్ శాఖ ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు పూర్తిగా ఆర్పే సమయానికి పూర్తిగా దగ్ధమైంది. దగ్ధమైన ఇల్లును సచివాలయ సిబ్బంది పరిశీలించారు. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆర్థిక నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందని సమాచారం.