April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

గూడూరు నియోజక వర్గంలో కూటమి జోరు – వైసీపీ శ్రేణుల చేరికతో క్యాడర్లో నూతనోత్సాహం

1 min read

 

భీమ్ న్యూస్ ప్రతినిధి గూడూరు (మార్చి 30) తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో కూటమి ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతుంది. గూడూరు నియోజకవర్గంలో గ్రామాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టిడిపి లోకి వలస పోతున్నారు. ప్రతీ రోజు ఏదో ఒక్కగ్రామం నుండి వైసీపీ కుటుంబాలు టిడిపిలో చేరిపోతున్నారు. దింతో జోష్‌లో టిడిపి, బీజేపీ, జనసేన కూటమి ఉండగా నిరుత్సాహంలో వైసీపీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో నాయుకులు, కార్యకర్తలు అంత తామై వైసీపీ విజయం కోసం పరీతంపించారు. 2024ఎన్నికలు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో వైసీపీ క్యాడర్ నిరుత్సాహం గా ఉండటంతో వైసీపీ అభిమానులను కలవర పెడుతుంది. గూడూరు పట్టణం 4వ వార్డు లో 20 వైసీపీ కుటుంబాలు టీడీపీ లో చేరికకూటమి ఆపరేషన్‌ ఆకర్ష్‌ భాగంగా మాజీ శాసన సభ్యులు, నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పాశింసునీల్ కుమార్ పిలుపు మేరకు, గూడూరు పట్టణంలోని 4 వార్డు దుర్జెటి నగర్ ప్రాంతం కు చెందిన వైసీపీ నాయుకులు పచ్చవ నరసింహ నాయుడు, తక్కిళ్ల పాటి చంద్రమౌళి, మైనంపాటి మోహన్, పచ్చవ శ్రీధర్, చంటి ల ఆధ్వర్యంలో శ్రీధర్ రెడ్డి, సురేష్ రెడ్డి,సంతోష్ రెడ్డి, ఎస్ డి.యాజద్దానీ, కాలేషా, నజీర్ బాషా, కొత్తపి ప్రభాకర్, కడియాల వెంకటేశ్వర్లు, గుత్త రమేష్, నాగరాజులతో పాటు 20 వైసీపీ కుటుంబాల వారు టిడిపి లో చేరారు. వీరికి సునీల్ కుమార్ టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, వాటంబేటీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *