April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

ప్రజలు తమ ఓటు హక్కుని ఎవరికి భయపడకుండా సద్వినియోగం చేసుకోవాలి: సిఐ మల్లికార్జున్

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి రేణిగుంట (మార్చి 30) తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తారక రామా నగర్ నందు శుక్రవారం రాత్రి రేణిగుంట సిఐ మల్లికార్జున్ ఎన్నికల  సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కుని ఎవరికి భయపడకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ తెలియజేశారు. ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉంటామని స్థానిక ప్రజలకు ధైర్యం చెప్పారు. స్థానికంగా కూడా అవుట్ పోస్ట్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని సిఐ మల్లికార్జున్   హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పోలీస్ శాఖ  సిబ్బంది, తిరుపతి ప్రెస్ క్లబ్ పి ఆర్ ఓ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *