April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

సీఎం జగన్ ఈనెల 4న రాక – సభాస్థలి పరిశీలనలో వైసీపీ నేతలు.

1 min read

 


భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (మార్చి 31) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 4వ తేదీన నాయుడుపేట పట్టణంలో నిర్వహించనున్న సిద్ధం సభ సందర్భంగా ఏర్పాటుచేస్తున్న సభాస్థలిని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైసిపి నాయకులు కార్యకర్తలు సమన్వయంగా పనిచేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట తిరుపతి ఎంపీ మధ్యలో గురుమూర్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి, శ్రీ చెంగాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి,నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి,వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒట్టూరు కిషోర్ యాదవ్, వైసిపి సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, ముమ్మడి సుబ్బారావు, ఎన్డీసీసీబీ మాజీ డైరెక్టర్ కలికి మాధవరెడ్డి, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకట కృష్ణారెడ్డి, కౌన్సిలర్ షేక్ షబ్బీర్, వైసిపి నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *