April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

నాయుడుపేటలో పెచ్చు మీరుతున్న గంజాయి – మత్తులో ఒకరిపై ఒకరు దాడులు

1 min read

 భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (మార్చి 31) తిరుపతి జిల్లా నాయుడుపేటలో గంజాయి మత్తులో యువకుడి పై దాడిచేసిన ఘటనలో గొంతు, మెడ భాగంలో బ్లెడుతో విచక్షణ రహితంగా కోసే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న కొంతమంది అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పిందని, గంజాయి మత్తుకు బానిసలై విచక్షణ కోల్పోపోతున్న యువతను మార్చి ప్రయత్నం ఎవరూ చేయడం లేదని, గంజాయి విక్రయాలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని, గతంలోనూ గంజాయి మహమ్మారి కారణంగా నేరాల బారిన పడ్డ అనేక మంది యువకులు ఉన్నారని స్థానికులు తెలుపుతున్నారు. 2022 డిసెంబర్ 31 రాత్రి గంజాయి కి బానిసలు అయిన కొంతమంది యువకులు మరో యువకుడిని విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి చంపేశారని అన్నారు. గ్రద్దగుంటకు చెందిన ఓ యువకుడు పై విన్నమాల కు చెందిన మరో యువకుడు గంజాయి మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకుని బ్లేడుతో మెడభాగం గొంతు భాగాల్లో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఘటనా స్థలంలోనే ఉన్న కొంత మంది అడ్డుకోవడంతో ప్రాణాపాయమే తప్పిందని బీడీ కాలనీని ఆనుకొని ఉన్న ఏటిగట్టు వద్ద ఉన్న ముళ్లపొదల్లో గంజాయిని పీల్చే బ్యాచ్ వారి కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ స్థానికులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చి గంజాయి. వాడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గంజాయి మత్తులో ఒకరిపై ఒక దాడి చేసుకోవడం ఇక్కడ సర్వసాధారణం అని కూడా వారు చెప్తున్నారు. గంజాయి అరికట్టే దిశగా పోలీసులు అడుగులు వేయాలని. గంజాయి మహమ్మారి నుండి యువతను కాపాడాలని నాయుడుపేట ప్రజలు కోరుకుంటున్నారు. యువత గంజాయి కి అలవాటు పడి చేరాని పనులు చేయడంలో వెనక ముందు లేకుండా తెగబడడంతో శాంతిభద్రతల సమస్యతో పాటు, అసాంఘిక కార్యకలాపాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని తెలిపారు. ఇటువంటి అరాచక సంఘటనలను పునరావృతం కాకుండా, శాంతిభద్రతల సమస్యలను అదుపు చేయడంలో పోలీసులు తగిన విధంగా చర్యలు చేపట్టడంలో ముందడుగు వేయాలని స్థానికులు పదేపదే మీడియా పరంగా కోరుతున్నామని తెలిపారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *