April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

ఉపాధ్యాయుడు కర్లపూడి ఆదెయ్యకు ఘన సన్మానం – పదవీ విరమణ శుభాకాంక్షలు. 

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట ( మార్చి 31) తిరుపతి జిల్లా నాయుడుపేటలో బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  పట్టణంలోని జనరల్ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేయుచున్న కర్లపూడి ఆదెయ్యకు పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంఈఓ నల్లమాకుల శ్రీనివాసులు, విశ్రాంత స్టేట్ బ్యాంక్ మేనేజర్ వై కోటేశ్వరరావు, బామ్ సెఫ్ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి రామకృష్ణ, తిరుపతి బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి వెంకట్రావు, జిల్లా మహిళ కార్యదర్శి సుశీలరవికుమార్, నాయుడుపేట మండలం అధ్యక్షులు పాలేటి చంద్రయ్య, కార్యదర్శి బొడ్డు బాబు, చిట్టమూరు మండల ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, సి హెచ్ సుబ్రహ్మణ్యం, దొరవారి సత్ర మండలం బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు రామయ్య, రవికుమార్, మూల్ నివాసి సంఘ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కరవళ్ల మురళీ, కె సుబ్రమణ్యం లు ఆదెయ్య కు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదెయ్య తన సర్వీస్ లో నిర్వహించిన అనేక కార్యక్రమాలను కొనియాడారు.ఆయన శేషజీవితం అనురాగంతో, సంతోషంగా గడుపుతూ ఉండాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *