April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

11 సార్లు డీఎస్సీ నిర్వహించిన ఘనత టీడీపీ దే: చంద్రబాబు నాయుడు

1 min read

   భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (మార్చి 31)) ఏపీ లో అబద్దాలు చెప్పడంలో దిట్ట, అహంకారి, దుర్మార్గుడైన జగన్ ప్రజాస్వామ్యానికి పనికిరాని వ్యక్తిని తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం నాయుడుపేట పట్టణంలో జరిగిన ప్రజా గళం సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. అవినీతిపరుడు, విధ్వంశ కారుడైన జగన్ ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప, ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయలేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తుందని, మిత్రపక్షాల ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వెయ్యి తప్పులు చేసిన జగన్ ను ప్రజలు క్షమించరన్నారు. నమ్మి ఓటేసిన ప్రజలను జగన్ గొంతు కోశారని విమర్శించారు. పేదల పక్షాన ఉంటామని పేదరిక నిర్మూలనకు పాటుపడతామని తెలియజేశారు. ఎన్నికల సమయంలో ప్రజల నెత్తిన చేతులు పెట్టి,ముద్దులు పెట్టి ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు అన్నారు. ఆవేదన ఆక్రందన బాధ ఆవేశంలో ఉన్న యువత రైతులు ఉద్యోగులు మహిళలు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ చిత్తుచిత్తుగా మొక్కలు చేసి డస్ట్ బిన్ లో వేస్తారని తెలిపారు. ప్రజలు అమాయకులు కాదు జగన్ కు గుణపాఠం చెబుతారని తెలియజేశారు. వైసిపి పాలనలో అన్ని వర్గాలు కులాలు వ్యవస్థలు దెబ్బతిన్నాయన్నారు. తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో ఐటి హాబ్ ఏర్పాటు చేసి ఇతర జిల్లాల వారికి సైతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. తనను చూసి పరిశ్రమలు వస్తాయని జగన్ ను చూస్తే బూమ్ బూమ్, ప్రెసిడెంట్ వంటి నాశరకం మద్యం మాత్రమే వస్తుందని, పరిశ్రమలు పారిపోతాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామన్నారు. అబద్ధాలు చెప్పి ప్రజల చెవుల్లో పూలు పెట్టిన జగన్ కు ఈసారి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగన్ చెవిలో పూలు పెట్టి శాశ్వతంగా రాజకీయానికి దూరం చేయాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా దోపిడీ లూటీ చేసే వారికి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు జగన్ ఇచ్చారని తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మెగాటి చేస్తే నిర్వహిస్తామని చెప్పిన సైకో జగన్ యువతను మోసం చేశారని తెలిపారు. జగన్ బచ్చాగా ఉన్నప్పుడే ఆయన తండ్రి కంటే ముందు తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని చంద్రబాబు తెలియజేశారు. సమైక్యాంధ్ర నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధించామని తెలిపారు.                                                                                                           తెలుగుదేశం పార్టీ హయాంలో 11 సార్లు డీఎస్సీ నిర్వహించామన్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని విమర్శించారు. వాలంటరీ వ్యవస్థను తీసేది లేదన్నారు. వాలంటీర్లు తట్టస్థంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వారి ఉద్యోగాలకు తాను హామీ అన్నారు. 5000 రూపాయలకు వాలంటరీ ఉద్యోగం చేస్తున్న, బాగా చదువుకున్న (ఎంఏ,బీఏ) వారికి 50 వేల నుండి లక్ష రూపాయలు సంపాదించుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఆయన తర్వాత మొదట డిఎస్సి నిర్వహణపై ఫైలు పై సంతకం చేస్తామన్నారు. మూడు నెలల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. వైసీపీ ఏర్పాటు చేసిన ప్రతి స్కీమ్ లోను స్కాములు జరిగాయి అన్నారు. మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ప్రజల రక్తాన్ని పీల్చుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మద్యం బ్రాండ్లు మన రాష్ట్రంలో లభించడం లేదన్నారు. చిల్లర కోసం ఆశపడి మద్యం దుకాణాల్లో ఆన్లైన్ పేమెంట్ లను ఎత్తివేసారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం అందించి ఆరోగ్యాలను కాపాడుతామన్నారు. మద్యం ధరలను నియంత్రిస్తామని తెలిపారు. ఇసుక బంగారం అయిపోయిందని ఉచిత ఇసుక పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు జీవనోపాధి కాలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక దోపిడీలో వేలకోట్ల దోచుకున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక పాలసీ చేస్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాలనీ ఇల్లు రద్దు చేయమని తెలిపారు. అర్హులైన వారందరికీ రెండు సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తామని తెలిపారు. ఉచిత ఇసుక పాలసీలో 6000 కోట్లు ఎమ్మెల్యేలు దోపిడీకి పాల్పడ్డారన్నారు మట్టి, గ్రావిల్ తరలించి కొండలను నామరూపాలు లేకుండా చేశారని తెలిపారు. వైసీపీ నేతల దోపిడీ కారణంగా గూడూరులో సిలికా మాయమైంది అన్నారు. సి పి ఆర్ బాండ్ల పేరుతో తిరుపతిలో 25 వేల కోట్ల స్కాములు జరిగాయని, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాధనాన్ని కాపాడుతామని తెలిపారు. అప్పుల అప్పారావు అయిన జగన్ ఇప్పటికే 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ తాకట్టు పెట్టారని అన్నారు. జగన్కు ఓటు వేస్తే ఇక ప్రజల ఇళ్లను సైతం తాకట్టు పెడతారని తెలిపారు. సంపదను సృష్టించి, సంక్షేమాన్ని చేపడుతామని, అభివృద్ధికి బాటలు వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని తెలియజేశారు. హైదరాబాద్ ను ఐ టి నగరంగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. బీసీలకు, మత్స్యకారులకు, రైతులకు న్యాయం చేస్తామన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో రెండు సార్లు గెలిచిన వైసిపి ఎమ్మెల్యే పాపాడ పెద్దిరెడ్డికి బినామీగా ఉంటున్నారని విమర్శించారు. స్వర్ణముఖి, కాలంగి నదులను దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. దీనితో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగింటి పోయాయి అన్నారు. స్వర్ణ ముఖి నది లో చెక్ డమ్ నిర్మించడం తోపాటు పొర్లు కట్టలు మరమ్మత్తులు చేపడతామన్నారు. రైతులకు సాగు నిరంతరం తో పాటు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ధరలను నియంత్రించడంతో పాటు చెత్త పన్ను ఎత్తివేస్తామన్నారు. సహజ వనరులను కాపాడుతామని తెలియజేశారు. తిరుపతి పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి వరప్రసాద్ రావు, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ డాక్టర్ నెలవల విజయశ్రీ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి డాక్టర్ పరసా వెంకటరత్నం, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, గూడూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పాశం సునీల్ కుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనం బేటి విజయభాస్కర్ రెడ్డి, నాయుడుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ షేక్ రఫీ, పట్టణ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తండోప తండాలుగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *