April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

సీఎం జగన్ పైకి చెప్పులు విసిరిన గుర్తు తెలియని దుండగులు

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి  గుత్తి  (మార్చి 31) రానున్న ఎన్నికల్లో గెలిచే ప్రయత్నంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచార కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేపట్టిన ప్రచార కార్యక్రమంలో సీఎం జగన్‌పై దాడికి యత్నించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జరిగిన ఈ ఘటనతో అక్కడి పోలీసులు, వైసీపీ పెద్దలు ఉలిక్కిపడ్డారు. అనంతపురం జిల్లా గుత్తిలో జగన్‌ బస్సు యాత్ర చేస్తుండగా గుర్తుతెలియని దుండగులు సీఎం టార్గెట్‌గా చెప్పు విసిరారు. అయితే జగన్‌కు ఆ చెప్పు తగలలేదు. వేరే చోట పడిపోయింది. జగన్‌ ప్రజలకు అభివాదం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా షాక్‌ అయ్యారు వైసీపీ నేతలు. అటు పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చెప్పు విసిరిన దుండగులు కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఇక జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సాగుతోండగా మరోవైపు నేడు ఈస్టర్ సందర్భంగా బస్సుయాత్రకు జగన్ విరామం ప్రకటించారు.  ఏప్రిల్‌ 1నుంచి బస్సు యాత్ర తిరిగి ప్రారంభం అవుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *