నెల్లటూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంటెక్ బాబు విస్తృత ప్రచారం.
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి సత్యవేడు (మార్చి 31) తిరుపతి జిల్లా సత్యవేడు స్థానికుడు సామాన్యుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశావహులు అభ్యర్థి ఎంటెక్ బాబు (కె వి బాబు) కు, మైనార్టీ అధ్యక్షులు గౌస్ మొహిద్దిన్ లకు సత్యవేడు నియోజకవర్గంలో పెరుగుతున్న ప్రజల ఆదరణతో శనివారం వరదయ్యపాలెం మండలం నెల్లటూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆశావహులు అభ్యర్థి ఎంటెక్ బాబు ( కే వీరస్వామి బాబు) కు, మైనార్టీ అధ్యక్షులు ఎస్కే గౌస్ మొహిద్దిన్ లకు గ్రామస్తులు ఆహ్వానం పలికారు. అందులో భాగంగా నెల్లటూరు గ్రామంలో విస్తృతంగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా నెల్లటూరు గ్రామస్తులు రవి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దాం హస్తం గుర్తుకు ఓటు వేద్దాం ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిద్దాం అని గట్టి నినాదంతో గ్రామస్తులు నడుమ పలికారు. స్థానికుడు అయినటువంటి ఎంటెక్ బాబును మనమందరం ఆదరిద్దాం అని గ్రామస్తులకు తెలిపారు. అధిష్టానం గుర్తించి ఎంటెక్ బాబుకు టికెట్ ఇస్తే అఖండ మెజారిటీతో గెలిపిద్దాం అని గ్రామస్తులకు తెలిపారు. ఇందిరమ్మ అభయ హస్తం క్రింద షర్మిలా రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల గుండెల్లోకి తీసుకెళ్దామని ఈ సంధర్భంగా గౌస్ మొహిద్దిన్ తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి గెలిపిస్తే ప్రతి ఇంటికి ప్రతి మహిళకు ప్రతినెల 8333/- కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లటూరు గ్రామ ప్రజలు రవి, మహేష్, గౌస్ మోయుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.