April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

ఘనంగా రన్ ఫర్ జీసస్ – కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో భారీ ర్యాలీ.

1 min read

 

    భీమ్ న్యూస్ ప్రతినిధి వాకాడు (మార్చి 31) పునరుత్థానుడైన క్రీస్తుకు జయ హో అంటూ స్వాగతం పలుకుతూ కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని అన్ని క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులు కోట, వాకాడు, చిట్టమూరు మండలాల పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం వేలాది మంది క్రైస్తవులు, పాస్టర్లు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాకాడులోని స్థానిక సెయింట్ జేమ్స్ లుథేరన్ చర్చి నుండి ఉదయం 6 గంటలకు కె వి సి చైర్మన్ వేము దినకర్ బాబు,పాస్టర్లు రెవ. ఎన్. ప్రశాంత్ బాబు, నోవబాబు, ఆశ మీనాన్, శ్యాంసుందర్, ప్రభాకర్, రత్నమ్, సురేష్, డేనియల్ చంద్రబాబు, ప్రవీణ్, వై.యమ్ సుమంత్, రాజ్ కుమార్, అజయ్ కుమార్ తదితరులు బెలూన్స్ ఏగురవేసి రన్ ఫర్ జీసస్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ సెయింట్ జేమ్స్ లుథేరన్ చర్చి నుండి అశోక్ పిల్లర్, రంగన్న గుంట, వెంకన్న పాళెం, ఆర్ ఆర్ టి రోడ్డు, దాదా రాయి గుంట మీదుగా గాంధీ బొమ్మ, ఆర్టీసీ కూడలి నుండి కోట క్రాస్ రోడ్డు వరకు చేరుకొని ముగిసింది.

ఈ సందర్భంగా కె వి సి పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ చైర్మన్ వేము దినకర్ బాబు మాట్లాడుతూ మానవులపై కరుణ, ప్రేమ కురిపించిన ఏసుక్రీస్తు పాపులకోసం చివరికి శిలువపై ప్రాణత్యాగం చేశారని అన్నారు. ఏసుక్రీస్తు చూపిన మార్గం అందరకి ఆదర్శప్రాయం కావాలన్నారు. ప్రతీ ఏటా ఇటువంటి రన్ ఫర్ జీసస్ ర్యాలీ నిర్వహించడం వలన మత సామరస్యానికి అద్దం పడుతుందన్నారు. క్రైస్తవులు ఏసు క్రీస్తు చూపిన మార్గం లో నడవాలి అనీ కోరారు. క్రైస్తవులు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నోవాబాబు మాట్లాడుతూ మృత్యుంజయుడైన ఏసుక్రీస్తుకు స్వాగతం పలుకుతూ సంబరాల మధ్య మూడు మండలాలకు చెందిన పాస్టర్ లు, క్రైస్తవులు ఐక్యమత్యంగా ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంనిర్వహించి నట్లు తెలిపారు. పాస్టర్లు రెవ. ఎన్.ప్రశాంత్ బాబుమాట్లాడుతూ పునరుత్థానుడైన ఏసుక్రీస్తును స్తుతిస్తూ కుల, మతాలకు ఆతీతంగా వేలాది మంది రన్ ఫర్ జీసస్‌లో పాల్గొనటం ఆహార్షణీయమన్నారు.
పాస్టర్లు నోవబాబు, ఆశ మీనాన్, శ్యాంసుందర్, ప్రసాదరావు లు మాట్లాడుతూ కరుణ, క్షమాగుణం క్రీస్తు స్వతం అన్నారు. ఏసుక్రీస్తు ప్రభువు వార్త పునరుద్దాన సువార్త యాత్రను (రన్ ఫర్ జీసస్ ర్యాలీ) దిగ్విజయంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేకమంది దైవజనులు ఏసుక్రీస్తు ప్రభువు గొప్పతనాన్ని గురించి కొనియాడుతూ, గీతాలాపనలు చేస్తూ ప్రభువు జనన మరణ పునరుద్దానమును గూర్చి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది వరకు క్రైస్తవ బిడ్డలు హాజరై ప్రభువును కీర్తిస్తూ ఘనపరిచిరి. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కోట, వాకాడు, చిట్టమూరు మండలాల క్రైస్తవ ప్రజలు, పాస్టర్లు రెవ. ఎన్ . ప్రశాంత్ బాబు,నోవబాబు,ఆశమీనాన్,శ్యాంసుందర్, ప్రభాకర్, రత్నమ్, సురేష్, డేనియల్ చంద్రబాబు, ప్రవీణ్, వై.యమ్ సుమంత్, రాజ్ కుమార్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *