April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

ఏపీ హంస ఇందుకూరుపేట తాలూకా నూతన కార్యవర్గం ఎన్నిక

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (ఏప్రిల్ 01) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల ఇందుకూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీ హంస) ఇందుకూరుపేట తాలూకా నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఆరోగ్యశాఖ విశ్రాంతి ఉద్యోగులు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అరికొండ హరిబాబు, హంస మహిళా రాష్ట్ర విభాగం గౌరవ చైర్మన్ ఆర్. ఇందిర, జనరల్ సెక్రెటరీ కల్పం శ్రీనివాసులు సమక్షంలో జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు, జనరల్ సెక్రెటరీ బి. కమల్ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ సునీల్, సబ్ ట్రెజరీ అధికారి వి. రమణారావు నేతృత్వంలో హంస జిల్లా ప్రతినిధులు మజార్హులా నాగరాజు లచే నూతన కార్యవర్గం ఎన్నిక అయ్యింది.

నూతన కార్యవర్గం వివరాలు

మైపాడు పీహెచ్సీ పబ్లిక్ హెల్త్ నర్స్ జి. అరుణా రాణి తాలూకా అధ్యక్షురాలుగా, కోడూరు పిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎ.వి. రమేష్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా, వరిగొండ పిహెచ్సి హెల్త్ సూపర్వైజర్ కె. వరలక్ష్మి జనరల్ సెక్రెటరీగా, జగదేవిపేట పిహెచ్సి ఎల్.డి. కంప్యూటర్ మహేష్ కుమార్ ట్రెజరగా, వరిగొండ పిహెచ్సి ఫార్మసీ అధికారి ఎస్.కె ఇస్మాయిల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, జగదేవిపేట పిహెచ్సి ఏఎన్ఎం జె. కెరోలిన్ మహిళా కార్యదర్శిగా, జగదేవిపేట పిహెచ్సి హెల్త్ సెక్రటరీ ధనలక్ష్మి పబ్లిసిటీ సెక్రెటరీగా, ఇందుకూరుపేట పిహెచ్సి స్టాఫ్ నర్స్ ఎస్పి. పర్వీన్, మైపాడు పిహెచ్సి ఏఎన్ఎం డి పద్మమ్మ వైస్ ప్రెసిడెంట్స్ గా, ఇందుకూరుపేట పిహెచ్సి ల్యాబ్ టెక్నీషియన్ ఎండి రఫీక్ అహ్మద్, మైపాడు పిహెచ్సి హెల్త్ అసిస్టెంట్ ఎస్. సంజీవ్, జగదేవిపేట పిహెచ్సి హెల్త్ అసిస్టెంట్ కుమార్ కె.వి వరప్రసాద్ లు జాయింట్ సెక్రటరీలుగా, కోడూరు పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ ఇందిరమ్మ, ఇందుకూరుపేట పిహెచ్సి ఫార్మసీ ఆఫీసర్ వి. భానురేఖ, మైపాడు పిహెచ్సి హెల్త్ సెక్రటరీ రాజ్యలక్ష్మి, కోడూరు పిహెచ్సి ఏఎన్ఎం ఎస్.జీవ కుమారి, జగదేవిపేట పీహెచ్సీ హెల్త్ సెక్రటరీ విజయమ్మ కార్యవర్గ సభ్యులు గా ఎంపికయ్యారు. మొత్తం 17 మంది సభ్యుల కార్యవర్గంతో పాటు కోడూరు పిహెచ్సి ఏఎన్ఎం కె. శారమ్మ, జగదేవిపేట పిహెచ్సి హెల్త్ సెక్రటరీ సుశీలమ్మ, హెల్త్ అసిస్టెంట్ ఖాదర్ బాషా లను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఇందుకూరుపేట హంస తాలూకా యూనిట్ గౌరవ అధ్యక్షులుగా ఆర్. ఉమ్మయ్య, గౌరవ సలహాదారులుగా బి. విజయమ్మ లను ప్రపుల్లా పెట్టారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ విశ్రాంతి ఉద్యోగులు, జిల్లా నాయకులు ఖాదర్ బాషా, హంస జిల్లా గౌరవ సలహాదారు అరవ పరిమళ, సిహెచ్ఓ అసోసియేషన్ నాయకులు, 104 ఉద్యోగ సంఘ నాయకులు, అధికారులు, ఉద్యోగులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *